గ్రీన్‌హౌస్ సాగుపై మూడు రోజుల శిక్షణ | Three days training to Green House Cultivation | Sakshi
Sakshi News home page

గ్రీన్‌హౌస్ సాగుపై మూడు రోజుల శిక్షణ

Sep 28 2016 12:12 AM | Updated on Sep 4 2017 3:14 PM

గ్రీన్‌హౌస్ సాగుపై రైతులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది.

సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ సాగుపై రైతులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజులో భాగంగా మెదక్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి 45 మంది రైతులు పాల్గొన్నారని ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

రెండో రోజు శిక్షణలో సమీపంలో ఉన్న గ్రీన్‌హౌస్‌లను సందర్శించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గ్రీన్‌హౌస్‌లో కూరగాయలు, పూల సాగులో మెళకువలు, పాలీహౌస్ నిర్మాణంలో జాగ్రత్తలు, ఎరువుల యాజ మాన్యం వంటి విషయాలను రైతులకు వివరిస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో ఉద్యానాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement