నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన అబ్బూరి సోమయ్య అనే వ్యక్తిని పంజగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన అబ్బూరి సోమయ్య అనే వ్యక్తిని పంజగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమీర్‌పేటలో ఒక ఇంట్లో దొంగతనం చేస్తుండగా పట్టుకున్న పంజగుట్ట పోలీసులు విచారించగా ఇతనిపై 40 కేసులు ఉన్నట్లు తెలిసిందని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. సోమయ్య నుంచి రూ.10 లక్షల విలువైన 13 ల్యాప్‌టాప్‌లు, 14 సెల్‌ఫోన్‌లు, 5 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.