చిన్నారి మెడలో గొలుసు చోరీ | The theft of chain from a child | Sakshi
Sakshi News home page

చిన్నారి మెడలో గొలుసు చోరీ

Jan 6 2016 7:01 PM | Updated on Sep 4 2018 5:07 PM

చాక్లెట్ కొనిస్తానని చిన్నారికి ఆశచూపిన దుండగుడు ఆమె మెడలోని గొలుసును దోచుకెళ్లాడు.

చాక్లెట్ కొనిస్తానని చిన్నారికి ఆశచూపిన దుండగుడు ఆమె మెడలోని గొలుసును దోచుకెళ్లాడు. ఈ ఘటన బుధవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుసూదన్ కథనం ప్రకారం... హస్తినాపురంలో నివసించే తిరుపతి రెడ్డి, ఆయన భార్య, కూతరు హాసిని(4) మంగళవారం రాత్రి పటేల్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో జరిగిన శుభకార్యానికి వచ్చారు.

హాసిని బయట ఆడుకుంటుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి చాకెట్లు కొనిస్తానంటూ పక్కనే ఉన్న కిరాణం కొట్టుకు తీసుకె ళ్లాడు. ఆమెకు మాయమాటలు చెప్పి మెడలో ఉన్న తులం బంగారు గొలుసును తస్కరించుకొని పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత కూతురు మెడలో గొలుసు లేదని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీనిపై వారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement