విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు చేపట్టిన మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
హైదరాబాద్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు చేపట్టిన మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సోమవారం ఉదయాన్నే ఏబీవీపీ శ్రేణులు మంత్రుల నివాస సముదాయంలోకి చొరబడటానికి ప్రయత్నించడంతో.. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.