నెక్లెస్‌రోడ్‌లో రేసర్ల పనిపట్టిన పోలీసులు | the police detained racers at Necklace road | Sakshi
Sakshi News home page

నెక్లెస్‌రోడ్‌లో రేసర్ల పనిపట్టిన పోలీసులు

Feb 28 2016 10:05 AM | Updated on Sep 4 2018 5:07 PM

నగరంలోని నెక్లెస్ రోడ్డులో బైక్ రేసర్లపై పోలీసులు మరోసారి కొరడా ఝుళిపించారు.

హైదరాబాద్‌: నగరంలోని నెక్లెస్ రోడ్డులో బైక్ రేసర్లపై పోలీసులు మరోసారి కొరడా ఝుళిపించారు. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ జోన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లో 70 మంది యువకులను అరెస్ట్‌ చేసిన పోలీసులు 102 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 20 రేసింగ్ బైక్‌లు కాగా, మైనర్లు నడుపుతున్న 51 బైక్‌లు కూడా ఉన్నాయి.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్‌లు.. సరైన పత్రాలు లేనివి 31 బైక్‌లు ఉన్నాయి. మైనర్ల తల్లిదండ్రులను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. కాగా, సెంట్రల్‌ జోన్‌ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్‌ డ్రైవ్‌ ఆపరేషన్‌ను వీడియో చిత్రీకరించినట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement