అన్నం తిన్నారని అట్లకాడతో వాతలు | The mother who tortured children | Sakshi
Sakshi News home page

అన్నం తిన్నారని అట్లకాడతో వాతలు

Jul 1 2017 3:00 PM | Updated on Sep 4 2018 5:24 PM

అన్నం తిన్నారని అట్లకాడతో వాతలు - Sakshi

అన్నం తిన్నారని అట్లకాడతో వాతలు

ఆకలిని తట్టుకోలేక అన్నం తిన్నందుకు తన ముగ్గురు బిడ్డలపై ఓ తల్లి అట్లకాడతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది.

► చిన్నారులను హింసించిన తల్లి

బషీరాబాద్‌ (తాండూరు): ఆకలిని తట్టుకోలేక అన్నం తిన్నందుకు తన ముగ్గురు బిడ్డలపై ఓ తల్లి అట్లకాడతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఐదు రోజులుగా ఆ చిన్నారులు నరకయాతన అనుభవించారు. తాండూరు రూరల్‌ సీఐ సైదిరెడ్డి కథనం ప్రకారం.. తాండూరులోని మాణిక్‌నగర్‌లో నివాసం ఉంటున్న సోఫియా, జావిద్‌ దంపతులకు మాహిన్‌ (6), హాజీ (3), నషీమా (1) సంతానం. సోఫియా గత ఆదివారం ఎప్పటిలాగానే ముగ్గురు పిల్లలను ఇంట్లో ఉంచి కూలీ పనికి వెళ్లింది.

ఆకలి కావడంతో మధ్యాహ్నం వారు అన్నం తిన్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి ఈ విషయాన్ని గుర్తించి పిల్లలను అట్లకాడతో ఇష్టానుసారంగా వాతలు పెట్టింది. శుక్రవారం ఉదయం పిల్లలు స్థానిక అంగన్‌వాడీ కేంద్రాని కి వెళ్లడంతో ఒళ్లంతా వాతలు చూసిన టీచర్‌ స్వప్న 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించింది. ఐదురోజులుగా చిన్నారులను బయటకు వెళ్లనీయకుండా ఇంట్లోనే బంధించిన విషయం వెలుగుచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement