నాలుగు రోజులు గా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతి శుక్రవారం మృతి
నల్లకుంట: నాలుగు రోజులు గా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతి శుక్రవారం మృతి చెందింది. వైద్యులు ఆమెకు వైద్యపరీక్షలు చేయించగా బాధితురాలు డెంగీ ఫివర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. నల్లకుంట ఇందిరానగర్ కు చెందిన పల్లవి(22) నాలుగు రోజుల క్రితం వాంతులు, తలనొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో బంధువులు చికిత్స కోసం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయినా తగ్గక పోవడంతో నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడా ఆరోగ్యపరిస్థితి మెరుగుపడక పోవడంతో గాంధీ జనరల్ ఆస్పత్రిలో చేర్పించగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. వ్యాధి నియంత్రణకు చికిత్స ప్రారంభించే లోపే ఆమె మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.