అమెరికా ఒలింపియాడ్‌లో తెలుగు తేజం | telugu student in aerican olympiad | Sakshi
Sakshi News home page

అమెరికా ఒలింపియాడ్‌లో తెలుగు తేజం

May 14 2015 3:11 AM | Updated on Apr 4 2019 3:19 PM

అమెరికా ఒలింపియాడ్‌లో తెలుగు తేజం - Sakshi

అమెరికా ఒలింపియాడ్‌లో తెలుగు తేజం

అమెరికాలో నిర్వహించిన ఓ సైన్స్ ఒలింపియాడ్‌లో హైదరాబాద్ అనంతసాగర్‌కు చెందిన త్విషారెడ్డి ప్రతిభను చాటుకుంది.

సాక్షి, హైదరాబాద్: అమెరికాలో నిర్వహించిన ఓ సైన్స్ ఒలింపియాడ్‌లో హైదరాబాద్ అనంతసాగర్‌కు చెందిన  త్విషారెడ్డి ప్రతిభను చాటుకుంది. అమెరికాలోని పెనిసిల్వేనియా రాష్ట్రంలోని అలెన్‌టౌన్‌లో ఉన్న స్ప్రింగ్‌హౌస్ మాథ్యమిక పాఠశాలలో త్విషారెడ్డి 8వ తరగతి చదువుతున్నది. ఎలాస్టిక్ పదార్థాన్ని ఉపయోగించి ఈవెంట్‌ను రూపొందించింది.

న్యాయమూర్తి నిర్దేశించిన ప్రదేశంలోనే ఆగే విధంగా నాలుగు చక్రాల వాహనాన్ని తయారు చేసింది. పెనిసిల్వేనియా సైన్స్ ఒలింపియాడ్‌లో త్విషారెడ్డి ప్రతిభను చాటి ప్రథమ బహుమతి సాధించింది. లింకన్ నెబ్రాస్కా రాష్ట్రంలో ఈ నెల 15, 16 తేదీల్లో జరుగనున్న అమెరికా జాతీయస్థాయి సైన్స్ ఒలింపియాడ్  టోర్నమెంట్‌లో తన పాఠశాల టీమ్ అర్హత సాధించేందుకు త్విషా సిద్ధమైంది. విజ్ఞానంపట్ల విద్యార్థుల్లో అవగాహన, సైన్స్‌పట్ల ఆసక్తిని పెంచేందుకు అమెరికా సైన్స్ ఒలింపియాడ్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement