కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహణ గర్వకారణం | Telangana Tourism Commissioner Sunitha Bhagavan speaks over Kite Festival | Sakshi
Sakshi News home page

కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహణ గర్వకారణం

Jan 16 2017 2:10 AM | Updated on Aug 11 2018 7:56 PM

కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహణ గర్వకారణం - Sakshi

కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహణ గర్వకారణం

రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి కైట్‌ ఫెస్టివల్‌ విజయవంతమైందని పర్యాటక శాఖ కమిషనర్‌ సునీతా భగవత్‌ అన్నారు.

రాష్ట్ర పర్యాటక కమిషనర్‌ సునీతా భగవత్‌
ముగిసిన కైట్‌ ఫెస్టివల్‌

మహేశ్వరం: రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి కైట్‌ ఫెస్టివల్‌ విజయవంతమైందని పర్యాటక శాఖ కమిషనర్‌ సునీతా భగవత్‌ అన్నారు. కైట్‌ ఫెస్టివల్‌ను ఆగాఖాన్‌ అకాడమీలో అంతర్జాతీయ స్థాయిలో రెండవ సారి నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆదివారం రావిర్యాల వద్ద ఉన్న ఆగాఖాన్‌ అకాడమీలో అంత ర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ ముగిసింది.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను నిర్వహించడం గర్వకారణ మన్నారు. పతంగులతో పాటు, ఫుడ్‌ ఫెస్టివల్, పతంగుల తయారీ, కళాబృందాల నృత్యాలు వంటి కార్యక్రమాలు నిర్వహించా మన్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమ తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆగాఖాన్‌ అకాడమీ ప్రిన్సిపాల్‌ ఫిషర్, తెలంగాణ పర్యాటక ఎండీ క్రిష్టియానా, ఆగాఖాన్‌ అకాడమీ నిర్వాహకులు డేవిడ్‌ , ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement