
'బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు'
రెండేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదని ఐటీ, పంచాయతీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: రెండేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదని ఐటీ, పంచాయతీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం శేరిలింగంపల్లి నుంచి మంత్రి కేటీఆర్ రోడ్ షో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటికీ ఒక్కసారి కూడా మోదీ తెలంగాణకు రాలేదన్నారు. బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నుంచి ఆరు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లలో కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించనున్నారు.