
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. మీడియం, ప్రీమియం మద్యం బ్రాండ్‌ల ధరలను 5 నుంచి 12 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు నేటి రాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎంఆర్‌పీ ధరలకు అనుగుణంగా నిర్ధేశిత శాతం ప్రకారం నేటి రాత్రి నుంచి ధరలు పెరుగుతాయి.
ఒక్కో క్వార్టర్ సీసాపై రూ.10, ఫుల్ బాటిలకు రూ.40 నుంచి రూ.60 వరకూ పెరుగుతాయి. అయితే ధరల పెంపు లిక్కర్‌కు మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు. రూ.400లోపు లభించే మద్యం ధరల్లో మాత్రం ఏమార్పు లేదు. బీర్ల ధరల పెంపు ప్రస్థావన ప్రస్తుతానికి లేదని, వాటి ధరలు యధావిధిగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2012 డిసెంబర్‌లో మద్యం ధరలు పెంచారు.