రాజీవ్ శర్మ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు | Telangana chief secretary rajiv sharma service extended For 3 months | Sakshi
Sakshi News home page

రాజీవ్ శర్మ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు

Aug 29 2016 8:17 PM | Updated on Sep 4 2017 11:26 AM

సీఎస్ గా రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయి.  కాగా ఈ నెల 31న రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగియనుండటంతో  ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఆరు నెలలు పదవీ కాలాన్ని పొడిగించాలని  ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

1982 బ్యాచ్‌కు చెందిన రాజీ వ్‌శర్మ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అసిస్టెంట్‌ కలెక్టర్‌గా సర్వీస్‌ ప్రారంభించారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి స్పెషల్‌ కమిషనర్‌గానూ రాజీవ్ శర్మ సేవలందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement