తెలంగాణ అసెంబ్లీ సమావేశం శనివారానికి వాయిదా పడింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశం శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. రాంరెడ్డి వెంకటరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలపై ఆసక్తిచూపారని అన్నారు. అనంతరం సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.