భార్యపై అసత్య ప్రచారం, సాప్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్ | Techi arrested for harassing his wife | Sakshi
Sakshi News home page

భార్యపై అసత్య ప్రచారం, సాప్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Mar 5 2015 9:20 AM | Updated on Aug 20 2018 4:27 PM

భార్యపై అసత్య ప్రచారం, సాప్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్ - Sakshi

భార్యపై అసత్య ప్రచారం, సాప్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అసత్య ప్రచారం చేస్తున్న ఓ శాడిస్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

హైదరాబాద్ : తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అసత్య ప్రచారం చేస్తున్న ఓ శాడిస్టును హైదరాబాద్ సైబర్  క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ రాజు కథనం ప్రకారం... సైదాబాద్కు చెందిన ఎస్.ప్రవీణ్ (47) సాప్ట్వేర్ ఇంజినీర్. అతని భార్య (45), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతా అమెరికాలో స్థిరపడ్డారు.

 

రెండేళ్లుగా విభేదాలు తలెత్తడంతో భార్యపిల్లల నుంచి ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు.  విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. ఇదిలా ఉండగా... భార్యపై కక్ష పెంచుకున్న ప్రవీణ్ బెదిరిస్తూ ఈ-మెయిల్ పంపడంతో పాటు ఆమెకు వివాహేతర సంబంధం ఉందని బంధువులు, కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్లు, మెయిల్స్ పంపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement