ఢిల్లీలో ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్ట్‌ | taskforce took four suspected into costudy, whome belived tobe terrorist group | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్ట్‌

Aug 24 2015 8:30 AM | Updated on Sep 3 2017 8:03 AM

ఢిల్లీలో ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్ట్‌

ఢిల్లీలో ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్ట్‌

నగరంలో మరో ఉగ్రవాద ముఠా సంచరిస్తోందా? పక్షంరోజుల కిందట పోలీసులకు పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది నజీర్తో వీరికి సంబంధాలు ఉన్నాయా?

ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు కొద్ది గంటల ముందు  హైదరాబాద్ హూజీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.., హర్కతుల్ జిహాద్‌ అల్ ఇస్లామీ కదలికలపై నిఘా పెట్టారు.

ఈ క్రమంలోనే  మెదక్ జిల్లా జహీరాబాద్ కు చెందిన షేక్ నూర్, ఢిల్లీకి చెందిన హకీంను ఢిల్లీలో పట్టుకున్నారు. వారిని  హైదరాబాద్ తరలించారు. వీళ్లిద్దరూ ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్న యువకులను బార్డర్ దాటించడంలో దిట్ట అని సిట్ పోలీసులు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement