
కేసీఆర్‌కు బుల్లెట్ ప్రూఫ్ గృహం అవసరమా?
రాష్ట్రంలోని నిరుపేదలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించలేని తెలం గాణ సీఎం కేసీఆర్..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఖానాపురం: రాష్ట్రంలోని నిరుపేదలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించలేని తెలం గాణ సీఎం కేసీఆర్.. తన బక్క ప్రాణాన్ని కాపాడుకునేందుకు మాత్రం బుల్లెట్ ప్రూఫ్ గృహం కట్టించుకోవడం అవసరమా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట, నర్సంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో తమ్మినేని మాట్లాడారు. పత్రికల్లో వచ్చిన ఎర్రవల్లి ఇండ్ల ఫొటోల కటింగ్‌లను మిగతా గ్రామాల్లో నిరుపేదలు తమ గుడిసెలకు అంటించుకుని డబుల్ బెడ్‌రూం గృహంలో పడుకున్నట్లే కలలు కనాలన్నట్లుగా కేసీఆర్, మంత్రులు మభ్యపెడుతున్నారని విమర్శించారు.
గిరిజన సంస్కృతి ప్రోత్సాహానికి ప్రత్యేక నిధులు
సాక్షి, హైదరాబాద్: గిరిజన తెగల్లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆయా తెగల మాతృభాషలోనే బోధించాలని, లిపి క్రమబద్ధీకరణకు భాషా నిపుణుల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సోమవారం సీఎంకు రాసిన లేఖలో కోరారు.