విపక్షాలకు అనుకూలం | Suitable for opposition | Sakshi
Sakshi News home page

విపక్షాలకు అనుకూలం

Apr 9 2016 3:53 AM | Updated on Sep 19 2019 8:44 PM

విపక్షాలకు అనుకూలం - Sakshi

విపక్షాలకు అనుకూలం

శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష, వేద పండితులు చిలుకూరి శ్రీనివాస్‌మూర్తి పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష, వేద పండితులు చిలుకూరి శ్రీనివాస్‌మూర్తి పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. శుక్రవారం ఉగాది వేడుకల సందర్భంగా గాంధీభవన్‌లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, సరైన వర్షాలు లేకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుందని అన్నారు.

రాష్ట్రంలో దొంగల స్వైరవిహారం, మహిళలకు భద్రత లేకుండా పోతుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement