తపాలా బిళ్లల రద్దు తగదు | Stamp inappropriate cancellation | Sakshi
Sakshi News home page

తపాలా బిళ్లల రద్దు తగదు

Sep 23 2015 1:19 AM | Updated on Sep 3 2017 9:47 AM

తపాలా బిళ్లల రద్దు తగదు

తపాలా బిళ్లల రద్దు తగదు

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలపై రూపొందించిన తపాలా బిళ్లల రద్దుకు నిరసనగా టీపీసీసీ నాయకులు మంగళవారం

అఫ్జల్‌గంజ్ : ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలపై రూపొందించిన తపాలా బిళ్లల రద్దుకు నిరసనగా టీపీసీసీ నాయకులు మంగళవారం అబిడ్స్‌లోని జీపీవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ తపాలా బిళ్లలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. తపాలా బిళ్లలు పునరుద్ధరించాలని కోరుతూ చీఫ్ పోస్ట్ మాస్టర్ సుధీర్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement