జూబ్లీహిల్స్ పీఎస్‌కు శృతిహాసన్ కేసు... | sruthihasan case shift to PS Jubilee Hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్ పీఎస్‌కు శృతిహాసన్ కేసు...

Mar 30 2015 11:57 PM | Updated on Sep 2 2017 11:36 PM

జూబ్లీహిల్స్ పీఎస్‌కు  శృతిహాసన్ కేసు...

జూబ్లీహిల్స్ పీఎస్‌కు శృతిహాసన్ కేసు...

కాల్షీట్లు ఇచ్చి సరిగ్గా సినిమా షూటింగ్ సమయంలో తనకు కుదరదంటూ మెయిల్‌పట్టి దర్శక, నిర్మాతలను చీటింగ్

బంజారాహిల్స్: కాల్షీట్లు ఇచ్చి సరిగ్గా సినిమా షూటింగ్ సమయంలో తనకు కుదరదంటూ మెయిల్‌పట్టి దర్శక, నిర్మాతలను చీటింగ్ చేసిన ఘటనపై నటి శృతిహాసన్‌పై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు సోమవారం బదిలీ చేశారు. సినిమా ఒప్పందం, కాల్షీట్ల డేట్లు, అడ్వాన్స్ చెల్లింపులు తదితర ప్రక్రియ అంతా బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిందని,  ఆ స్టూడియో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో పోలీసులు ఈ కేసును జూబ్లీహిల్స్‌కు బదిలీ చేశారు.

ఫైల్‌ను అందుకున్న జూబ్లీహిల్స్ పోలీ సులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శృతిహాసన్‌కు నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. నేడో రేపో ఆమెకు నోటీసులు జారీ చేసి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సిందిగా సూచించనున్నారు. ఆమె నుంచి కేసుకు సంబంధించిన వాంగ్మూలం తీసుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement