టాలీవుడ్ అభిమానులు రెండు భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' ఈ రెండు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియో క్లిప్ప్ లీక్ అయ్యాయి. దీంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ.. జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. హైదరాబాద్‌లో వేసిన ఒక సెట్స్‌లో పెద్ది ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్రదేశం నుంచి లీక్ అయ్యాయి. పెద్ది ఐటెమ్ సాంగ్‌పై భారీ క్రేజ్ ఉంది. ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్‌లో...’ అంటూ మహేష్ బాబుతో స్టెప్పులు వేసిన శ్రుతి హాసన్.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఐటెమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్‌లో క్రేజ్‌ను పెంచారు.
నాని 'ది ప్యారడైజ్' నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ సినిమాల నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో అభిమానులలో ఉత్సాహం పెరిగినప్పటికీ, చిత్రనిర్మాతలలో ఆందోళన నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' ఆగష్టు 21, 2026న రానుంది.


