'కచ్చా స్పిరిట్ వల్లే చిన్నారుల మృతి'


 హైదరాబాద్: జూబ్లీహిల్స్ జవహర్నగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం సంభవించిన  పేలుడు ఘటనకు కచ్చా స్పిరిట్ కారణమని పోలీసులు తెలిపారు. కచ్చా స్పిరిట్ను పొయ్యిలో పోయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో కీర్తివాణి, నర్సమ్మ అనే చిన్నారులు చనిపోగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద కారణాలను పోలీసులు తెలిపారు.ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తల్లి సరస్వతి ఓ స్టూడియోలో పనిచేస్తోంది. పొయ్యి వెలిగించుకునేందుకోసం స్టూడియో నుంచి కచ్చా స్పిరిట్ను ఇంటికి తీసుకువచ్చింది. పెట్రోల్, స్పిరిట్ను కలిపితే కచ్చా స్పిరిట్ అవుతుందని పోలీసులు తెలిపారు. సినిమాల్లో పేలుళ్ల కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఈ రోజు ఉదయం పొయ్యి వెలిగించేందుకు ఈ స్పిరిట్ను వేయగా, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  కీర్తివాణి, నర్సమ్మ చనిపోయారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top