'హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు' | special status will not solve all problems, saysvenkaiah naidu | Sakshi
Sakshi News home page

'హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు'

Oct 9 2015 12:06 PM | Updated on Mar 23 2019 9:10 PM

'హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు' - Sakshi

'హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు'

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హాదా ఇవ్వడంతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నగరంలోని మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశాన్ని నీతిఆమోగ్ పరిశీలిస్తోందని తెలిపారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉన్నా వారు ఇంకా సహాయం కావాలని అడుగుతున్నారంటూ పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలే అయిందని, తమ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా అమలుచేస్తున్నామని వెంకయ్య చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement