'మరో రెండు రైల్వే జంక్షన్లు అభివృద్ధి చేయండి' | south central railway GM ravindra guptha meets with CM KCR | Sakshi
Sakshi News home page

'మరో రెండు రైల్వే జంక్షన్లు అభివృద్ధి చేయండి'

Dec 4 2015 6:57 PM | Updated on Sep 4 2018 5:07 PM

'మరో రెండు రైల్వే జంక్షన్లు అభివృద్ధి చేయండి' - Sakshi

'మరో రెండు రైల్వే జంక్షన్లు అభివృద్ధి చేయండి'

హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తాను కోరారు.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తాను కోరారు. హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం కేసీఆర్ తో రైల్వే జీఎం రవీంద్ర గుప్తా భేటీ అయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లపై ఒత్తిడి పెరిగినందున నగర శివార్లలో మరో రెండు జంక్షన్లను అభివృద్ధి చేయాలని సీఎం కోరారు.

చర్లపల్లి, నాగులపల్లి రైల్వే జంక్షన్లు ఇందుకు అనుకూలమని కేసీఆర్ వివరించారు. సికింద్రాబాద్ రైల్వేకు చెందిన 15 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే.. మరో చోట అంతే స్థలాన్ని రైల్వేకు అప్పగిస్తామని కేసీఆర్, ద.మ రైల్వే జీఎం రవీంద్ర గుప్తాకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement