breaking news
GM ravindra guptha
-
యుద్ధ ప్రాతిపదికన పనులు
రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సత్తెనపల్లి: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రెండు వేల మీటర్ల రైల్వే ట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా రైల్వే అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను శనివారం ఆయన స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఇక్కడ ట్రాక్ దెబ్బతినడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం నాటికి పనులు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా యథావిధిగా రైల్వేట్రాక్ పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌ను ఆయన సందర్శించి పరిసరాలు పరిశీలించారు. రైల్వే అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయనతోపాటు డీఆర్ఎం విజయశర్మ, డీఐజీ జీఎం ఈశ్వరరావు, ఆర్థిక సలహాదారు పూర్ణచర్ల, చీఫ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తదితరులు ఉన్నారు. -
'మరో రెండు రైల్వే జంక్షన్లు అభివృద్ధి చేయండి'
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తాను కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం కేసీఆర్ తో రైల్వే జీఎం రవీంద్ర గుప్తా భేటీ అయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లపై ఒత్తిడి పెరిగినందున నగర శివార్లలో మరో రెండు జంక్షన్లను అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వే జంక్షన్లు ఇందుకు అనుకూలమని కేసీఆర్ వివరించారు. సికింద్రాబాద్ రైల్వేకు చెందిన 15 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే.. మరో చోట అంతే స్థలాన్ని రైల్వేకు అప్పగిస్తామని కేసీఆర్, ద.మ రైల్వే జీఎం రవీంద్ర గుప్తాకు వివరించారు.