మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం | software engineer missing in hyderabad | Sakshi
Sakshi News home page

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

May 16 2016 6:35 PM | Updated on Sep 4 2017 12:14 AM

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

యాకుత్‌పురా: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై బి.ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం... లాల్‌దర్వాజా నాగులచింత ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణ కుమార్తె స్నేహ (25) గచ్చిబౌలిలోని హిందుజా గ్లోబల్ సొల్యూషన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆఫీస్‌లో సమావేశం ఉందని ఇంట్లో చెప్పి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువులతో పాటు సాధ్యమైనన్నీ ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement