మంత్రి కేటీఆర్ కు జాతీయ స్థాయి పురస్కారం | skoch award for minister KTR | Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్ కు జాతీయ స్థాయి పురస్కారం

Mar 2 2016 9:56 PM | Updated on Sep 3 2017 6:51 PM

మంత్రి కేటీఆర్ కు జాతీయ స్థాయి పురస్కారం

మంత్రి కేటీఆర్ కు జాతీయ స్థాయి పురస్కారం

టెక్నాలజీ, పరిపాలనా, పారదర్శకత అనే అంశాల అధారంగా గత రెండు సంవత్సరాలుగా వినూత్నమైన పద్దతుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయితీరాజ్, ఐటీ, మరియు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావుకి మరోసారి జాతీయ స్ధాయి గుర్తింపు లభించింది.

  • కేటీఆర్ కు చాలెంజర్ అప్ ద ఇయర్ అవార్డ్
  • వెంకయ్య నాయుడికి లైప్ టైం అచీవ్ మెంట్ అవార్డు
  • హైదరాబాద్: టెక్నాలజీ, పరిపాలనా, పారదర్శకత అనే అంశాల అధారంగా గత రెండు సంవత్సరాలుగా వినూత్నమైన పద్దతుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయితీరాజ్, ఐటీ, మరియు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావుకి మరోసారి జాతీయ స్ధాయి గుర్తింపు లభించింది. పరిపాలన ద్వారా సమాజంలో అద్బుతమైన మార్పులను తీసుకొచ్చే వ్యక్తులకి లభించే స్కోచ్ అవార్డ్. ఈ సంవత్సరానికిగాను మంత్రి కె.తారక రామారావుకి ఛాలెంజర్ అప్ ద ఇయర్ అవార్డ్ దక్కింది. గత 14 ఏళ్లుగా దేశంలోని ప్రముఖులు గౌరవంగా భావించే ఈ అవార్డుకి ఎంపిక కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

    టీహబ్  లాంటి వినూత్న ప్రాజెక్టులు చేపట్టి, టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పుల సాధన ద్వారా నూతన భారతదేశ అవిష్కరణ కోసం పనిచేస్తునందుకు ఈ అవార్డు ఇస్తున్నట్లు స్కోచ్ సంస్ద తెలిపింది. మార్చ్ 19న డీల్లీలో జరిగే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు స్వీకరించేందుకు రావాల్సిందిగా మంత్రికి అహ్వనం తెలిపింది. స్కోచ్ చాలెంజర్ అవార్డ్ ని స్టార్ట్ అప్ ఇండియా కేటగిరిలో  ఇవ్వనున్నట్లు తెలిపింది. ఐటీ రంగంలో గత ఏడాదిన్నర కాలం నుంచి  చేపట్టిన పలు కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్నామని, ముఖ్యంగా అంత్జాతీయ స్ధాయి ఇంక్యూబేటర్ టీహబ్ ని ఏర్పాటు చేశారన్నారు. ఈ టీహబ్ ద్వారా స్టార్ట్ అప్ లకి చేయూత అందించడంలో మంత్రి ముందు వరుసలో ఉన్నారన్నని అవార్డ్ కమీటీ తెలిపింది. ఈ దేశంలో స్టార్ట్ అప్స్, వాటికివ్వాల్సిన మద్దతు అనే అంశంపైన మంత్రి కేటీఆర్ ని కీనోట్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కోరారు. మంత్రి కేటీఆర్ తో పాటు కేంద్ర మంత్రికి వెంకయ్య నాయుడు కి లైప్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement