గచ్చిబౌలిలో ఆర్టీఏ తనిఖీలు : వాహనాలు సీజ్ | Six vehicles seized by RTA in Hyderabad city | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలిలో ఆర్టీఏ తనిఖీలు : వాహనాలు సీజ్

Nov 29 2014 9:29 AM | Updated on Sep 2 2017 5:21 PM

నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలోని గచ్చిబౌలిలో శనివారం ఆర్టీఏ అధికారులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలోని గచ్చిబౌలిలో శనివారం ఆర్టీఏ అధికారులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ఆరు వాహనాలను సీజ్ చేశారు. అలాగే సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న పలు వాహనదారులపై జరిమాన విధించారు.

నగరంలో వివిధ ప్రాంతాలలో ఆర్టీఏ అధికారులు ఇటీవల కాలంలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. దీంతో అక్రమంగా తిరుగుతున్న పలు వాహనాలను సీజ్ చేసి భారీగా జరిమాన విధిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement