గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం | singer sravana bhargavi | Sakshi
Sakshi News home page

గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం

Jan 23 2014 5:11 AM | Updated on Aug 14 2018 3:22 PM

గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం - Sakshi

గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం

సినీ గాయని శ్రావణభార్గవి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో జాతీ యరహదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటి లో తప్పించుకున్నారు.

చిట్యాల, న్యూస్‌లైన్: సినీ గాయని శ్రావణభార్గవి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో జాతీ యరహదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటి లో తప్పించుకున్నారు. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బుధవా రం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు.

శ్రావణి ప్రమాణిస్తున్న కారుకు ఎదురుగా చిట్యాల శివారులో రాంగ్‌రూట్‌లో ఓ ట్రాక్టర్ రాగా, దాన్ని తప్పించబోయిన శ్రావణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు టైరు పగిలి నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆనంతరం ఆమె భర్త, గాయుకుడు హేమచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని, శ్రావణభార్గవిని మరో కారులో విజయవాడకు తీసుకెళ్లారు.
 

Advertisement
 
Advertisement
Advertisement