క్రమంగా కోలుకుంటున్న సంజనా | sanjana health condition improve, says kamineni hospital | Sakshi
Sakshi News home page

క్రమంగా కోలుకుంటున్న సంజనా

Oct 12 2016 11:15 AM | Updated on Sep 4 2017 5:00 PM

పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజనా ఆరోగ్య పరిస్థితి క్రమంగా కోలుకుంటుందని కామినేని వైద్యులు బుధవారం వెల్లడించారు.

హైదరాబాద్ : పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజనా ఆరోగ్య పరిస్థితి క్రమంగా కోలుకుంటుందని కామినేని వైద్యులు బుధవారం వెల్లడించారు. ఆమె ఇంకా వెంటిలేటర్పైనే కొనసాగుతుందని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన పెద్ద అంబర్పేట వద్ద సంజనాతోపాటు ఆమె తల్లిని తాగి వాహనం నడిపి... యువకులు ఢీకొట్టిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో సంజనాతోపాటు ఆమె తల్లీ కూడా తీవ్రంగా గాయపడింది. వీరు ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సంజనాను కారు ఢీకొట్టడంతో ఆమె తాతయ్యకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement