విమానం దిగుతూ తూలిన ట్రంప్‌ | Donald Trump Health Concerns Rise After Air Force One Stumble | Sakshi
Sakshi News home page

విమానం దిగుతూ తూలిన ట్రంప్‌

Mar 23 2026 5:05 AM | Updated on Mar 23 2026 6:06 AM

Donald Trump Health Concerns Rise After Air Force One Stumble

ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (79) ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. తాజాగా ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం నుంచి కిందికి దిగే క్రమంలో తడబడ్డారు. రెయిలింగ్‌ను గట్టిగా పట్టుకొని చాలా జాగ్రత్తగా దిగుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కురీ్చలో కూర్చోవడానికి కూడా ట్రంప్‌ ఇబ్బంది పడ్డారు. రెండు చేతులతో కురీ్చని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. మోకాళ్లు వంచేటప్పుడు ముఖం బిగుసుకుపోయి కనిపించింది. అయితే తాను భేషుగ్గా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement