సాయికిరణ్ హత్యపై క్షమాపణ | Sai Kiran murder On Forgiveness | Sakshi
Sakshi News home page

సాయికిరణ్ హత్యపై క్షమాపణ

Jun 20 2015 3:10 AM | Updated on Apr 4 2019 3:19 PM

సాయికిరణ్ హత్యపై క్షమాపణ - Sakshi

సాయికిరణ్ హత్యపై క్షమాపణ

అమెరికాలోని ఫ్లోరిడాలో హైదరాబాద్ విద్యార్థి సాయికిరణ్ దారుణ హత్యపై అక్కడి ప్రభుత్వం స్పందించింది.

* స్పందించిన అమెరికా అధికారులు  
* రేపు రాత్రికి చేరనున్న మృతదేహం

సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో హైదరాబాద్ విద్యార్థి సాయికిరణ్ దారుణ హత్యపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని అమెరికా అధికారులు శుక్రవారం సాయికిరణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి క్షమాపణలు తెలిపారు. 5 వేల డాలర్లు తక్షణ పరిహారంగా కుటుంబీకులకు అందించనున్నట్లు ప్రకటించారు. ఘటనపై విచారణాధికారిని నియమించినట్లు చెప్పారు.  దర్యాప్తు వివరాలను సైతం తెలియపరుస్తామని తెలిపారు. సాయికిరణ్ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి  పంపిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement