నారాయణగూడ వద్ద రూ. 60 లక్షలు స్వాధీనం | Rs. 60 lakhs seized at Narayanaguda by City police | Sakshi
Sakshi News home page

నారాయణగూడ వద్ద రూ. 60 లక్షలు స్వాధీనం

Apr 15 2014 9:33 AM | Updated on Sep 2 2017 6:04 AM

నారాయణగూడ వద్ద రూ. 60 లక్షలు స్వాధీనం

నారాయణగూడ వద్ద రూ. 60 లక్షలు స్వాధీనం

నారాయణగూడ వద్ద తనిఖీలలో భాగంగా ముగ్గుర వ్యక్తుల నుంచి రూ.60 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా మంగళవారం నారాయణగూడ వద్ద తనిఖీలలో భాగంగా ఓ కారు నుంచి  రూ.60 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

 

తమ స్వస్థలం ముంబై అని, వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చామని సదరు వ్యక్తులు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే నగదుకు సంబంధించి సరైన పత్రాలు వెల్లడించకపోవడంతో పోలీసులు ఆ ముగ్గురుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అలాగే నగదు, కారును కూడా స్టేషన్కు తరలించి సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement