ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకూ అంత్యక్రియల నిమిత్తం రూ.10వేలు ఇస్తుండగా, దీన్ని రూ.15 వేలకు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ (సేవలు) కార్యదర్శి డాక్టర్ బి. కిశోర్ బుధవారం జీవో జారీ చేశారు.
పదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేలకు పెంచాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించగా, ప్రభుత్వం రూ.15 వేలకు పరిమితం చేసింది. అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు అన్ని స్థాయిల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.