నగరంలోని నేరేడ్‌మెట్ గోకుల్‌నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ దోపిడీ జరిగింది.
హైదరాబాద్: నగరంలో పట్టపగలు కలకలం రేగింది. స్థానిక నేరేడ్‌మెట్ గోకుల్‌నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ దోపిడీ జరిగింది. స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాకర్ నుంచి రూ.7 లక్షల నగదు, ఏడు తులాల బంగారు ఆభరణాలు, పది తులాల వెండిని తీసుకువెళ్తున్న ఫాతిమా అనే మహిళ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగ్‌ను ఎత్తుకు పోయారు. బాధితురాలు నేరేడ్‌మెట్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసరాల్లోని సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.