రీతూ మృతదేహానికి రీ పోస్ట్మార్టం | Re-post-mortem of Ex-air hostess reethu | Sakshi
Sakshi News home page

రీతూ మృతదేహానికి రీ పోస్ట్మార్టం

Apr 21 2015 1:05 PM | Updated on Jul 30 2018 8:29 PM

రీతూ మృతదేహానికి రీ పోస్ట్మార్టం - Sakshi

రీతూ మృతదేహానికి రీ పోస్ట్మార్టం

భర్త చేతిలో దారుణ హత్యకు గురైన మాజీ ఎయిర్హోస్టెస్ రీతూ మృతదేహానికి వైద్యులు రీ పోస్ట్మార్టం నిర్వహించారు.

హైదరాబాద్ :  భర్త చేతిలో దారుణ హత్యకు గురైన మాజీ ఎయిర్హోస్టెస్ రీతూ మృతదేహానికి వైద్యులు రీ పోస్ట్మార్టం నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో 11 మంది సభ్యుల వైద్యుల బృందం మంగళవారం రీ పోస్ట్మార్టం చేశారు.  మరోవైపు అల్లుడు సచిన్నే తన కుమార్తెను హత్య చేసినట్లు రీతూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కాగా భర్త ఇంట్లో మద్యం సేవించడంపై రీతు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో మద్యం మత్తులో ఉన్న సచిన్ బీరు సీసాతో రీతు తలపై బలంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భయపడ్డ సచిన్ స్నేహితులు, అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ సహకారంతో రామంతాపూర్‌లోని మాట్రిక్ అస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. అయితే అప్పటికే రీతు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో... కంగారుపడి ఏమీ ఎరగనట్టుగా రీతు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి బెడ్‌రూంలో పడేసి... ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement