వెంకయ్యనాయుడు దళిత ద్రోహి : రామ్మూర్తి | Ram murthi comments on venkaiah | Sakshi
Sakshi News home page

వెంకయ్యనాయుడు దళిత ద్రోహి : రామ్మూర్తి

Aug 12 2016 4:19 AM | Updated on Sep 4 2017 8:52 AM

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దళిత ద్రోహి అని తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు పసుల రామ్మూర్తి విమర్శించారు.

తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు రామ్మూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దళిత ద్రోహి అని తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు పసుల రామ్మూర్తి విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం అనుకూలంగా ఉందని వెంకయ్య చెప్పడం సరికాదన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ సాధ్యం కాదని రెండు నెలల క్రితం కేంద్ర న్యాయ శాఖ మంత్రి తేల్చిన విషయం వెంకయ్యకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే వెంకయ్యను మంత్రి పదవినుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement