
'బంగారం, ఉప్పులపై అసత్య ప్రచారం'
పెద్ద నోట్ల రద్దుతో కశ్మీర్‌లో అల్లర్లు ఆగిపోయాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పారు.
విజయవాడ: పెద్ద నోట్ల రద్దుతో కశ్మీర్‌లో అల్లర్లు ఆగిపోయాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పారు. వాజపేయి జన్మదినం సందర్భంగా విజయవాడ కొత్తపేటలో పేదలకు దుస్తులు, దుప్పట్లు వెంకయ్యనాయుడు పంచారు.
ఈ సందర్భంగా నగంలోని వెన్యూ ఫంక్షన్ హాల్‌లో గుడ్ గవర్నస్ డే సదస్సులో పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడారు. బంగారం, ఉప్పులపై విపక్షాలది అసత్య ప్రచారం అని చెప్పారు. పెద్ద నోట్ల రద్ద వల్ల వచ్చే ఆదాయాన్ని హౌసింగ్, హెల్త్ విభాగాలకు ఖర్చు చేస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు.