నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం | Rain in many parts of the city | Sakshi
Sakshi News home page

నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం

Mar 30 2015 12:14 PM | Updated on Sep 4 2018 5:16 PM

కొద్దిరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న నగర వాసుల్ని వరుణుడు కరుణించాడు.

హైదరాబాద్ : కొద్దిరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న నగర వాసుల్ని వరుణుడు కరుణించాడు.  నగరంలో సోమవారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. జంట నగరాల్లోని నాంపల్లి, కోఠీ, ఎంజీబీఎస్, మెహదీపట్నం, లక్డీకపూల్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. దీంతో నగరంలో ఎంతో వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉంది. ఎండల నుంచి హైదరాబాద్ నగర వాసులకు కాస్తంత ఉపశమనం కలిగింది.

Advertisement
 
Advertisement
Advertisement