
పూలేకు వైఎస్సార్ సీపీ ఘన నివాళి
మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. బీసీలు, మహిళల అభ్యున్నతికి పూలే చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలుత పూలే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కొడాలి నాని, పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, నల్లా సూర్యప్రకాశ్, వేణుంబాక విజయసాయిరెడ్డి, కొండా రాఘవరెడ్డితో పాటు పలువురు నాయకులు కూడా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.