నకిలీ పోలీస్ అరెస్టు | pseudo police arrested in hyderabad police | Sakshi
Sakshi News home page

నకిలీ పోలీస్ అరెస్టు

Jul 15 2016 3:12 PM | Updated on Aug 20 2018 4:44 PM

ఆటో ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: ఆటో ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారం కిత్రం నింబోలిఅడ్డా ప్రాంతంలో యూనస్ అనే వ్యక్తి పోలీసునంటూ బెదిరిస్తూ ఆటోలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను బెదిరించి రూ.1.80 లక్షలు దోచుకెళ్లాడు.

బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా యూనస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ. 80 వేల నగదుతోపాటు ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement