నేరెళ్ల బాధితులకు వైద్యం అందించండి | Provide medicine for the Nerella victims | Sakshi
Sakshi News home page

నేరెళ్ల బాధితులకు వైద్యం అందించండి

Sep 13 2017 2:49 AM | Updated on Aug 31 2018 8:34 PM

నేరెళ్ల బాధితులకు వైద్యం అందించండి - Sakshi

నేరెళ్ల బాధితులకు వైద్యం అందించండి

పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో గాయపడిన సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితుల్లో ఇద్దరికి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యసాయం

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్‌: పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో గాయపడిన సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితుల్లో ఇద్దరికి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యసాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

నేరెళ్ల, జిల్లెల, రామచంద్రా పురం గ్రామాల దళితులపై పోలీసులు జరిపిన దాడిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభు త్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతత్వం లోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరి పింది. అనంతరం బాధితుల్లో ఎంత మందికి వైద్య సాయం అవసరమని పిటిషనర్‌ న్యాయవాది రఘునాథ్‌ని అడగ్గా, ఇద్దరికి అవసరమని ఆయన చెప్పారు. వారికి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యసాయం అందిస్తామని ఏజీ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement