లా కమిషన్‌ ప్రతిపాదనలపై నిరసన


పలు తీర్మానాలు చేసిన బార్‌కౌన్సిల్, న్యాయవాద సంఘాలు

21న న్యాయవాదుల బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాదుల చట్టానికి లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతిపా దించిన పలు సవరణలను ఉభ య రాష్ట్రాల న్యాయవాదులు   వ్యతిరేకించారు. లా కమిషన్‌ ప్రతిపాదనలతో తయారైన న్యాయవాదుల (సవరణ) బిల్లు 2017ను వ్యతిరేకించాలని, నిరసన కార్యక్ర మాలు చేపట్టాలని నిర్ణయించారు. న్యాయవా దుల సవరణ బిల్లు నేపథ్యంలో ఇటీవల బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) కూడా పలు తీర్మానాలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణంలో ఆదివారం రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు చిత్తరవు నాగేశ్వరరావు, జల్లి కనకయ్యతో పాటు ఉభయ రాష్ట్రాల్లోని పలు న్యాయవాద సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్‌కౌన్సిల్‌ సభ్యుడు ఎన్‌.ద్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ...లా కమిషన్‌ ప్రతిపాదనలు న్యాయవ్యవస్థ కు, న్యాయవాదులకూ వ్యతిరే కంగా ఉన్నాయన్నారు.బార్‌ కౌన్సిల్‌ క్రమ శిక్షణ కమిటీల్లో న్యాయవాదులేతరులకు స్థానం కల్పించాలన్న ప్రతిపాదన ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. బార్‌ కౌన్సిల్‌లో విశ్రాం త ప్రధాన న్యాయమూర్తి, విశ్రాంత న్యాయ మూర్తులకు స్థానం కల్పించాలన్న ప్రతిపాదన కూడా సరికాదన్నారు. చిన్న పొరపాటు చేసి నా న్యాయవాదులకు రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించాలన్న ప్రతి పాదనపై విస్మయం ప్రకటించారు. న్యాయవాదుల స్వేచ్ఛను దెబ్బతీసేలా ప్రతి పాదనలు చేసిన లా కమిషన్, వారి సంక్షే మానికి, రక్షణకు ఎలాంటి సూచనలూ చేయకపోవడాన్ని అందరూ తప్పుపట్టారు.

ఈ సమావేశంలో చేసిన ప్రధాన తీర్మానాలివి...


  • న్యాయవాదుల చట్టానికి సవరణకు సంబంధించి లా కమిషన్‌ చేసిన ప్రతిపాదనలన్నింటినీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.

  • ఈ నెల 21న అన్ని కోర్టుల్లో భోజన విరామ సమయంలో నిరసన. లా కమిషన్‌ చైర్మన్‌ రాజీనామాకు డిమాండ్‌.

  • ప్రధాని, న్యాయశాఖ మంత్రి, గవర్నర్‌ లకు వినతిపత్రాలు. అలాగే పార్లమెంట్‌ లో ఈ బిల్లును వ్యతిరేకించాలని ఆయా ప్రాంతాలకు చెందిన ఎంపీలకు వినతి పత్రాల సమర్పణ.

  • బీసీఐ ఆధ్వర్యంలో మే 2న జరగనున్న నిరసన ర్యాలీలో పాల్గొనాలి
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top