మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సనత్ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న
హైదరాబాద్ : మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సనత్ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ నివాసంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏపీఎస్పీ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా వ్యభిచారం అనే మాట వినపడకుండా చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వ్యభిచారం నిర్వహించేందుకు వినియోగించిన ఇంటిని, అందులోని సామగ్రిని సీజ్ చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు.