నేడు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రాక | president pranab mukherjee come to day at 5 pm | Sakshi
Sakshi News home page

నేడు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రాక

Dec 18 2015 2:09 PM | Updated on Aug 14 2018 10:54 AM

శీతాకాలం విడిది నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ రానున్నారు.

హైదరాబాద్‌: శీతాకాలం విడిది నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హకీంపేట విమానాశ్రయంలో ప్రణబ్ కు స్వాగతం పలకనున్నారు.

ఈ నెల 31వరకు హైదరాబాద్లోనే రాష్ట్రపతి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి కూడా రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఏపీ, కర్ణాటకలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement