ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?: పొన్నాల | Ponnala Lakshmaiah comments on Cm KCR | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?: పొన్నాల

Aug 27 2017 3:26 AM | Updated on Aug 15 2018 9:37 PM

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?: పొన్నాల - Sakshi

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?: పొన్నాల

సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, అంచనాల పెంపు, అక్రమాలు, ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై బహిరంగ చర్చకు సిద్ధమేనా..

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, అంచనాల పెంపు, అక్రమాలు, ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై బహిరంగ చర్చకు సిద్ధమేనా.. అని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌కు, ప్రగతిభవన్‌కు పలువురు నేతలను పిలిపించుకొని కేసీఆర్‌ పొగిడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టులు పూర్తి, రైతాంగానికి సాగునీరు అందించాలనే చిత్తశుద్ధి సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ జీవో ఇచ్చినా న్యాయస్థానాల నుంచి మొట్టికాయల్లేకుండా ఉంటున్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరంకుశ, గఢీల పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement