మండలి ఉపనేత పదవికి పొంగులేటి గుడ్‌బై? | Ponguleti goodbye for council vice chairperson? | Sakshi
Sakshi News home page

మండలి ఉపనేత పదవికి పొంగులేటి గుడ్‌బై?

Jul 15 2017 4:01 AM | Updated on Mar 18 2019 7:55 PM

మండలి ఉపనేత పదవికి పొంగులేటి గుడ్‌బై? - Sakshi

మండలి ఉపనేత పదవికి పొంగులేటి గుడ్‌బై?

వెనుకబడిన తరగతుల కోసం శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పదవి నుంచి వైదొలగాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది.

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల కోసం శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పదవి నుంచి వైదొలగాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయాలు, అవమానాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ కాంగ్రెస్‌ బీసీ ఫోరం ఆవిర్భవించిన నేపథ్యంలో పొంగులేటి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది.

శాసనమండలి, శాసనసభ ప్రతిపక్షనేతలు షబ్బీర్‌ అలీ, కె.జానారెడ్డిలకు ఈ మేరకు లేఖలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. పార్టీలో ఓ వర్గం అన్యాయానికి గురైనట్టుగా భావించడం వల్ల దీర్ఘకాలంగా పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందని, అలా జరుగకుండా ఉండాలంటే బీసీల కోసం తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement