
రైతులను ఆదుకోండి: పొంగులేటి
వ్యవసాయరంగంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో అక్రమాలు జరిగాయని, ఒక్కో రైతు నుంచి వందల రూపాయలు వసూలు చేశారన్నారు. రైతు సంక్షేమ నిధి పక్క దారి పట్టిందని, సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయకుండా ఇష్టరీతిలో ఖర్చు చేస్తు న్నారని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.