జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో టీకాలు వేయనున్నారు.
ఈ నెల 29న పల్స్‌పోలియో
Jan 26 2017 10:33 PM | Updated on Sep 5 2017 2:11 AM
హైదరాబాద్: జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో టీకాలు వేయనున్నారు. నగరంలో 3200 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాక్సినేషన్ కోసం 1200 మంది ఏఎన్‌ఎంలు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులను ఎంపిక చేశారు.
తొలి రోజు కేవలం ఎంపిక చేసిన బూతుల్లోనే కాకుండా బస్టాండ్లు, రైల్వే స్టే షన్లు, విమానాశ్రయాలు, దేవాలయాలు, పార్కులు, ఇతర రద్దీ ప్రదేశాల్లోనూ పోలియో వాక్సిన్ వేయనున్నారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు డోర్ టు డోర్ తిరిగి పోలియో వాక్సిన్ వేయించుకోని చిన్నారులను గుర్తించి వారికి చుక్కల మందు వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Advertisement


