కాచిగూడలో కార్డెన్ సెర్చ్ | police cordon search in hyderabad kachiguda | Sakshi
Sakshi News home page

కాచిగూడలో కార్డెన్ సెర్చ్

Mar 26 2016 10:13 PM | Updated on Sep 4 2018 5:07 PM

నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో సుందర్ నగర్లో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో ప్రతి ఇంటినీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల కార్డెన్ సెర్చ్ కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement