జూబ్లీహిల్స్లో భారీగా పోలీసు తనిఖీలు | police conduct cardon search in jubileehills, banjara hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్లో భారీగా పోలీసు తనిఖీలు

Sep 27 2014 7:57 AM | Updated on Sep 2 2017 2:01 PM

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేసిన పోలీసులు.. 65 మందిని అదుపులోకి తీసుకున్నారు.

నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు మొదలుపెట్టారు. ఇటీవలే మల్లేపల్లి ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేసి, దాదాపు 56 మంది వరకు నేరస్థులను, కొన్ని హత్యకేసుల్లో నిందితులను కూడా పట్టుకున్న పోలీసులు.. ఇప్పుడు తాజాగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలుపెట్టిన ఈ ఆపరేషన్.. తెల్లవారుజాము వరకు కొనసాగింది. మొత్తం 65 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 25 మంది పేకాట రాయుళ్లను కూడా అరెస్టు చేశారు. నగరంలో నేరాలను అదుపులోకి తెచ్చేందుకే ఈ కార్డన్ సెర్చ్ చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement